ఆదరించి మరో అవకాశం ఇవ్వండి మరింత అభివృద్ధి చేస్తా

మక్తల్ , ఆంధ్రప్రభ ; మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు అభివృద్ధి కోసం తనకు ఆదరించి ఆశీర్వదించి మరోసారి గెలిపించండి మరింత అభివృద్ధి చేస్తానని బిజెపి అభ్యర్థి బాల్చేడ్ పావని మల్లికార్జున్ అన్నారు.శనివారం వార్డు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎలాంటి నిధులు ఇవ్వద్దని గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలమూరు ఎంపీ డీకే. అరుణ మద్దతుతో మక్తల్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడం బిజెపికే సాధ్యమని అన్నారు.
13వ వార్డులో అనేక సమస్యలు పరిష్కరించామని మరోసారి అవకాశం కల్పించండి మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు .మిషన్ భగీరథ పైప్లైన్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని అన్నారు. అదేవిధంగా వార్డులో నెలకొన్న వివిధ సమస్యలు ,పారిశుద్వానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. మరోసారి గెలిపించి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 13వ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని బాల్చేడ్ పావని మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బి. ఆంజనేయులు సూర్య, మహేష్ సాగర్ ,వన్నవాడ శ్రీకాంత్ ,గోపాల్ , నారాయణ, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
