player| దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధూ

player| దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధూ
ఎయిర్‌పోర్ట్ వద్ద పేలుళ్లు..
కమ్ముకున్న పొగ
ఇప్పడు అంతా క్షేమంగా ఉన్నామన్న సింధూ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తాజాగా అక్కడి పరిస్థితులపై ఆమె ఎక్స్‌లో వివరించారు. దుబాయ్ విమానాశ్రయంలో తామున్న ప్రాంతానికి సమీపంలోనే పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ప్రాణభయంతో పరుగులు తీశామని పేర్కొన్నారు. ‘‘ఇక్కడి పరిస్థితులు గంట గంటకూ భయానకంగా మారుతున్నాయి. నా కోచ్‌తో సహా అందరం భయంతో అక్కడినుంచి పరుగులు తీశాం. అని తెలిపారు. ప్రస్తుతం తామంతా క్షేమంగానే ఉన్నామని చెప్పారు.
