నంద్యాల బ్యూరో, మే 6 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో పైలట్ ట్రైనింగ్ అకాడమికి నిధులు మంజూరైనట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. మంగళవారం ఎంపీ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడి విభాగం ఏపీఏడీసీఎల్ ఆధ్వర్యంలో ఓర్వకల్లు విమానాశ్రయంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్ టీ ఓకి కనెక్ట్ చేసే టాక్సీవేని అందించడం కోసం రూ.2.27 కోట్లు మంజూరు చేసి పరిపాలనా అనుమతి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.
పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాను విన్నవించడంతో కేంద్ర విమానాయశాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ నిధుల నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేశారని ఆమె చెప్పారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు కోసం ఏపీఏడీసీఎల్ 2024న జూలై 26వ తేదిన ఓరియంట్ ఫ్లైట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎండీ పేర్కొన్నారని తెలిపారు. ఈ ఒప్పందం షరతుల ప్రకారం ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ 12నెలల్లో సాధ్యమైందన్నారు. ఈ ఏడాది జులై 25వ తేదీన అమలు చేయబడుతుందని, సంతకం చేసిన ఒప్పందం ప్రకారం ఏపీ డీసీఎల్ రన్‌వే నుండి హంగర్ వరకు టాక్సీవేను అందించాలని ఒప్పందం నిబంధన 2.41 ఎం మేరకు ప్రభుత్వం అభ్యర్థించిందన్నారు. ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ట్యాక్సీవే కోసం హెడ్ ఈడ్ ఆఫ్ అకౌంట్ 5053-02-190-11-28 531 కింద అడ్మినిస్ట్రేటివ్ 19530531ఎఫ్ రూ.27 కోట్లను అందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారని, దీనికి అధికార ఏపీడీసీఎల్ బాధ్యత వహిస్తుందని, అమలు చేయాల్సిన పనులకు అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించనున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను నిశితంగా పరిశీలించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయంలోని విమాన శిక్షణా సంస్థ టాక్సీవే కోసం హెడ్ ఆఫ్ అకౌంట్ 5053-02-190-11-28-530-531 కింద రూ.2.27 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఓరియంట్ ప్లైట్స్ ప్రయివేట్ లిమిటెడ్ కర్నూలు విమానాశ్రయంలో ప్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ను స్థాపించిందని, ప్లయింగ్ స్కూల్ హ్యాంగర్ కు రూ.2.27 కోట్లతో ట్యాక్సీవే నిర్మాణం చేయాలని ఎంపీ శబరి తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, అంతర్గత వనరుల నుండి అవసరమైన ఆర్థిక వనరులను సక్రమంగా సమీకరించుకుని, తదనుగుణంగా అవసరమైన చర్య తీసుకుంటుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.