Pilot | అందుబాటులో ఉంటా.. గెలిపించండి
Pilot | తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం చెన్ గేష్ పూర్ గ్రామ సర్పంచిగా గెలిపిస్తే అందుబాటులో ఉండి పనిచేస్తానని సర్పంచి అభ్యర్థి ప్రవీణ్ గౌడ్ అన్నారు. ఈ రోజు గ్రామంలో వార్డు సభ్యులతో కాంగ్రెస్ నేతలు, యువకులు, మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నన్ను గెలిపిస్తే చెన్ గేష్ పూర్, కొనాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, మన గ్రామాన్ని పైలెట్ గ్రామ పంచాయతీగా ఎంపిక చేశారని ఎమ్మెల్యే మన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీలకతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

