Photo Story| బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ సభకు జన ప్రభంజనం

ఎల్క‌తుర్తి : బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ సభా ప్రాంగణం.. జ‌న‌సంద్రంగా మారింది. ఇసుకెస్తే రాల‌నంత‌గా జ‌నం త‌ర‌లివ‌చ్చారు. స‌భా ప్రాంగ‌ణ‌మంతా చీమల దండులా త‌ల‌పిస్తోంది. స‌భా ప్రాంగ‌ణానికి దాదాపు నాలుగైదు కిలోమీట‌ర్ల వ‌ర‌కు జ‌నం బారులు తీరారు. ఇక స‌భా ప్రాంగ‌ణంలో క‌ళాకారుల ఆట‌పాట‌ల‌కు జ‌నం ఉర‌క‌లేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్స్‌లు చేస్తున్నారు. తెలంగాణ పాట‌ల‌తో గులాబీ సైనికులు, ప్ర‌జ‌లు ఊగిపోతున్నారు. గులాబీ జెండాల‌ను రెప‌రెప‌లాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

ఇక ఎల్క‌తుర్తికి నలువైపులా.. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు బారులు తీరాయి. జ‌నాలు త‌మ వాహ‌నాల‌ను దిగి న‌డ‌క‌దారిన ఎల్క‌తుర్తికి త‌ర‌లివ‌స్తున్నారు. . కేసీఆర్ ఎల్క‌తుర్తి స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోగానే.. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాల‌తో స‌భా ప్రాంగ‌ణం ద‌ద్ద‌రిల్లిపోయింది

Leave a Reply