ప్రభాకరరావు బెయిలు పిటిషన్ విచారణ వాయిదా
న్యూ ఢిల్లీ – ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడ శ్రవణ్ కుమార్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టు ఆయన వేసిన పిటిషన్ పై నేడు తుది విచారణ జరిగింది.. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కొన్ని షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.. ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిచినా పోలీసుల ఎదుట హాజరుకావాలని శ్రవణ్ సూచించింది.. ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దంటూ ఆదేశాలిచ్చింది.. ఈ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి శ్రవణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. అటు తర్వాత ఆయన అమెరికాకు చేరుకున్నారు.. దీంతో ఇప్పటికే ఆయనపై పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు.. ఈ నేపథ్యంలోనే ఆయనకు ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు మంజూరు చేసింది.
ప్రభాకర్ రావు బెయిల్ పై విచారణ వాయిదా..
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.. నేడు జరిగిన విచారణలో కౌంటర్ దాఖలుకు తమకు రెండు వారాలు సమయం కావాలని పోలీసుల తరుపు న్యాయవాది కోరారు.. అభ్యర్దనను మన్నించి రెండు వారాలలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, అప్పటి వరకు విచారణను వాయిదా వేస్తునట్లు హైకోర్టు పేర్కొంది.
కాగా, ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని తెలిపారు. 30 ఏళ్లకు పైగా పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో అత్యంత అంకితభావంతో పనిచేశానని, చట్టవిరుద్ధంగా ఏ పనీ చేయలేదని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాదం, ఇస్లామిక్ టెర్రరిజంను కట్టడి చేయడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.
తన సర్వీసు మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలుమార్లు ప్రశంసలు అందుకోవడమే కాకుండా తన ప్రతిభను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సైతం శ్లాఘించాయని పేర్కొన్నారు. తాను క్యాన్సర్‌తోపాటు కొవిడ్ కారణంగా గొంతు, ఊపిరితిత్తులకు సోకిన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా పనికివచ్చే ఒక్క సాక్ష్యం కూడా లేదని, కేవలం ఇతర నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలు తప్ప పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ప్రభాకరరావు తరుపు న్యాయవాది వాదించారు. దీనిపై పోలీసులు రెండు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వం న్యాయవాదిని కోరింది.