విచారణ 14కు వాయిదా

విచారణ 14కు వాయిదా

ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది.ఈ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత కోర్టుకు కీలక సమాచారం వెల్లడించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ (ఎఫ్ఎస్ఎల్) ((FSL) నివేదికలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కీలక సాక్ష్యాలు లభించాయని తెలిపారు.

నివేదికను కోర్టుకు అందజేయడానికి కొంత సమయం కావాలని ఆయన అభ్యర్థించారు. అదే సమయంలో, ఈ నివేదికను తమకు కూడా అందజేయాలని ప్రభాకర్ రావు, శేషాద్రి నాయుడు డిమాండ్ చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

Leave a Reply