ఇస్లామాబాద్, ఆంధ్రప్రభ : పెహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనపై ఇటు పాకిస్థాన్ లోనూ,అటు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉగ్రసంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ సంచలన ప్రకటన చేసింది. మొదట ఈ దాడి తమ పనే అని ప్రకటించుకున్న టిఆర్ఎఫ్ ఇప్పుడు మాట మార్చింది. పెహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది. ఈ మేరకు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తమ వ్యవస్థలి భారత్ హ్యాక్ చేసినట్లు ప్రకటనలో ఆరోపించింది.
‘పెహల్‌గామ్ ఘటనలో తమ ప్రమేయం లేదని పేర్కొంది. ఈ చర్యను టీఆర్‌ఎఫ్‌కు ఆపాదించడం తొందరపాటు చర్యే అవుతుందంటు ఎత్తిపొడిచింది. . ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో కూడా తమకు సంబంధం లేదని అంటూ భారత్ తమ వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ మెసేజ్ పోస్ట్ చేసిందని ఆరోపించింది.. ఇది భారత సైబర్-ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ల పని అంటూ పేర్కొంది.. దీనిపై తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది