Person | అనుమానాస్పద మృతి..

Person | అనుమానాస్పద మృతి..
- అంత్యక్రియలు నిలిపివేసిన పోలీసులు
Person |గుడివాడ, ఆంధ్రప్రభ : స్నేహితుడి మృతి పై అనుమానం ఉందని ఓ వ్యక్తి పోలీ సులకు ఫిర్యాదు చేయగా అంత్యక్రియలకు శ్మశానంలో సిద్ధంగా ఉన్న మృతదేహాన్ని గుడి వాడ వన్ టౌన్ పోలీసులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీరామపురానికి చెందిన సబ్బాని వెంకటేశ్వరరావు 26న వెంక టేశ్వర రెస్టు హోమ్ రోడ్డులో పడి ఉన్నాడని అతని రెండో కుమారుడు కేశవరావుకు స్థాని కులు తెలిపారు. అతడు వెళ్లి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్వర రావు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొ న్నారు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం అంత్యక్రియలకు మృతదేహాన్ని పుల్లల పాడు శ్మశానవాటికకు తరలించారు.
అయితే కొలుసు నాగరాజా అనే వ్యక్తి ఎస్పీ, వన్ టౌన్ పోలీసులకు తన స్నేహితుడు వెంకటే శ్వరరావు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని మరణ కారణం తెలుసుకో వడానికి ప్రభుత్వాసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. ఈమేరకు వన్ టౌన్ ఎస్సై వైవీవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరరావుది ఆత్మహత్య అని, దీనికి కారణం వైకాపా సాను భూతి పరుడైన ఓ దస్తావేజు లేఖరి అంటూ ప్రచారం సాగుతోంది.
