విజయవాడ ఎంపీపై పేర్ని నాని ఫైర్
మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ : మచిలీపట్నం గొడుగు పేట వెంకటేశ్వర స్వామి(Lord Venkateswara) ఆలయ భూములలో వేలు పెట్టిన విజయవాడ ఎంపీ చిన్ని పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోయిన నావ, చిల్లులు పడిన చెక్క నావ అని పేర్నినాని అభివర్ణించారు.
మచిలీపట్నం(Machilipatnam) గొడుగు పేట వెంకటేశ్వర స్వామి మహిమ గల దేవుడని, స్వామి ఆలయం పై కన్నువేసిన తెలుగు దేశం నాయకులు రెండో కంటికి తెలియకుండా కనకదుర్గమ్మ ఆలయానికి కేటాయించిన భూముల పై కుటిల బుద్ధి ప్రదర్శించారని ఆరోపించారు. కబ్జా చేయాలి చూడటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ముందుకు వెళ్ళకుండా విరమించుకున్నా నేటి న తెలుగుదేశం సీనియర్ నాయకులకు కనుపిప్పు కలగలేదు, అన్నారు.
గొడుగుపేట(Godugupet) వెంకటేశ్వరస్వామి ఆస్తి పై కన్ను వేసిన కేశినేని చిన్ని పర్యాసానంగా తను అక్రమ వ్యాపారాలు బూడిద వ్యాపారం, జగ్గయ్యపేట , నందిగామ ఇసుక వ్యాపారం మూతపడ్డాయని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి నాకు తెలియదు, యూట్యూబ్, టీవీ(YouTube, TV)లో తప్ప నేనెప్పుడూ ఆయనను చూడలేదు, అని పేర్నినాని వివరణ ఇచ్చారు.
పేకాట తప్ప వేరే ఆట తెలియని కేశినేని చిన్నిని ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నియమించిన ఘనత పాలకులకే దక్కుతుందన్నారు. మచిలీపట్నం గొడుగు పేట వెంకటేశ్వర స్వామి దేవుడు ఆస్తులపై కన్ను వేసినందుకే చిన్నికి ఈ పరిస్థితి ఏర్పడింది. మున్ముందు కేశినేని చిన్ని(Keshineni Chinni)తో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే గతి పడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

