అనుమతులు లేకుండా ఇసుక తరలింపు..

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు..

ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకొని నారాయణపేట జిల్లాఊట్కూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఊట్కూర్ ఎస్సై రమేష్ కథనం ప్రకారం మండల పరిధిలోని కొల్లూర్ గ్రామ సమీపంలో శనివారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇసుక ట్రాక్టర్ రావడంతో నిలిపిఅనుమతి పత్రాలు అడగగా ఎలాంటి అనుమతి లేకపోవడంతో ట్రాక్టర్ పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చినట్లు తెలిపారు.

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న డ్రైవర్ పసుల భీమేష్, ట్రాక్టర్ యజమాని హరిజన్ వెంకటప్ప పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, మొరం తరలిస్తే ప్రభుత్వం నిబంధనల ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Leave a Reply