ఆత్మయోగాతో సంపూర్ణ ఆరోగ్యం..

ఆత్మయోగాతో సంపూర్ణ ఆరోగ్యం..
కోడూరు, ఆంధ్రప్రభ : ఆత్మ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని కాంతి కేంద్రం సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విజయానందగిరి స్వామీజీ (చలపతిరావు మాస్టారు) అన్నారు. కోడూరులోని ఆర్యవైశ్య ప్రార్థన మందిరంలో ఈ నెల 23 నుండి 29 వరకు ఆత్మ యోగ పేరుతో యోగాసనాలు, ధ్యానం పై వారం రోజులు శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రార్థన మందిరానికి విహానందగిరి స్వామీజీ విచ్చేసి కాంతి కేంద్రం సేవా ట్రస్ట్ సభ్యులతో మాట్లాడారు.
శిక్షణ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుందని, శారీరక ఆరోగ్యం కోసం యోగాసనాలు, మానసిక ఆరోగ్యం కోసం ప్రాణాయామం, ధ్యానం నేర్పించబడును అన్నారు. వివిధ రకాల దీర్ఘకాలిక ఇబ్బందులను ఈ ఆత్మ యోగాతో పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఆత్మ యోగ శిక్షణా తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంతి కేంద్రం సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు అన్నం సురేంద్రనాథ్, అన్నం వెంకట సుబ్బారావు, ఉల్లి గురురంగ ప్రసాద్, అన్నం శ్రీధర్, యద్దనపూడి గోపాలకృష్ణ, కోట వెంకట సుబ్బారావు, పూతబోయిన వెంకటకృష్ణారావు, కోట సత్యనారాయణ, అన్నం యోగానంద్, పడమటి శ్రీనివాసరావు, ఇంకొల్లు అశోక్ మహారాజ్, బురగడ్డ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
