ప్ర‌జ‌ల భ‌యాందోళ‌న‌

ప్ర‌జ‌ల భ‌యాందోళ‌న‌

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట(Narayanapet) జిల్లా మక్తల్ మండల పరిధిలోని మహాద్వార్ గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. దీంతో ఆ గ్రామ‌స్థులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. నిన్న రాత్రి మహాద్వార్ గేటు నుండి మహాద్వార్(Mahadwar) గ్రామానికి వెళ్లే దారిలో మేకపోతును గొంతు కోసి బలి ఇవ్వడంతోపాటు గుమ్మడికాయలు నిమ్మకాయలు కుంకుమ చల్లి క్షుద్ర పూజలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల కూడా రక్తం చల్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

గుమ్మడికాయలు(Pumpkins) నిమ్మకాయలు(Lemons) కోసి వేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం గుర్తించిన గ్రామస్తులు విచారణ క్షుద్ర పూజలు ఎవరు నిర్వహించారని విచారణ జరుపుతున్నారు. ఈ విషయమై గ్రామస్తులను సంప్రదించగా ఎప్పుడూ త‌మ‌ ఊర్లో ఇలాంటి సంఘటనలు జరగలేదని అన్నారు. ప్రస్తుతం ఎవరు చేశారనే అంశంపై గ్రామ పెద్ద‌లు ఆరా తీస్తున్నార‌న్నారు.

Leave a Reply