Telangana | జూబ్లీహిల్స్ లో అభివృద్ధికే పట్టం

Telangana | జూబ్లీహిల్స్ లో అభివృద్ధికే పట్టం

Telangana | ఊట్కూర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి.యగ్నేశ్వర్ రెడ్డి (D.Yagneshwar Reddy) శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఊట్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో జరుపుకున్నట్లు పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ (Jubilee Hills) గెలుపు ప్రతిపక్షాలకు చంపపెట్టని అన్నారు. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించారన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలుపొందడంతో నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.

ప్రజా పాలన (Public administration) లో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు మంజూరు చేస్తూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తంచేశారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) సహకారంతో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply