సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీకే ఫైల్స్, సైబర్ నేరాలు(Cyber crimes), డిజిటల్ అరెస్టుల పట్ల జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మంగళవారం జిల్లా ప్రజలకు సూచించారు. ఇటీవల “డిజిటల్ అరెస్ట్(Digital Arrest)” అనే పేరుతో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్న సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీకి అవకాశం గంటలోపే… అప్రమత్తతే కీలకం అన్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ళు పోలీసులమని, సీబీఐ అధికారులమని లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ (video calls)చేస్తూ మీ మీద కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారని, మీరు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, మీ పేరు మీద కొరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ సిమ్, బ్యాంక్ ఖాతా(SIM, Bank Account)కు వాడబడిందనే వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఎప్పుడూ వీడియో, ఆడియో కాల్స్ చేయరన్న విషయం గ్రహించాలన్నారు.
ఎవరికీ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారమివ్వడం పోలీసుల(Police) పని కాదని, సైబర్ నేరాల లో చిన్న మొత్తంలో అప్పు ఇచ్చి, పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నలోన్ యాప్ మోసాలు, ఉద్యోగ మోసాలు అధిక జీతాలు వాగ్దానం చేసి, రిజిస్ట్రేషన్(Registration) లేదా ట్రైనింగ్ పేరుతో డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలు ఆకర్షణీయ ఆఫర్లు చూపించి వస్తువులు పంపకుండా మోసం చేస్తున్నాయని తెలియజేసారు ఎస్పీ.
ఇక ఇన్వెస్ట్మెంట్ మోసాలు, క్రిప్టో, షేర్లు, ట్రేడింగ్(Crypto, Shares, Trading) పేరుతో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఫేక్ ఈ-కామర్స్ ఓ ఎల్ ఎక్స మోసాలు, నకిలీ కొనుగోలు, అమ్మకాలు చేస్తూ క్యూ ఆర్ కోడ్, తప్పుడు చెల్లింపుల ద్వారా డబ్బు పోగొడతారని, రొమాన్స్, డేటింగ్ మోసాలు, సోషల్ మీడియా(Social Media) ద్వారా నమ్మకం కలిగించి తరువాత అత్యవసరాల పేరుతో డబ్బు అడుగుతారన్నారని, సోషల్ మీడియా మోసాలు నకిలీ ప్రొఫైళ్లతో బంధువులు, స్నేహితుల పేరుతో డబ్బులు అడుగుతున్నారని అన్నారు.
ఇంకా ఎస్. పీ..
ఓటీపీ, కె వై సి(OTP, KYC) మోసాల గురించి తెలియజేస్తూ ప్రజలు ఎవరితోనూ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ పంచుకోవద్దని సూచించారు. ఎలాంటి సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 నంబర్‌కి కాల్ చేయాలని లేదా డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. సైబరక్రైమ్.గవర్నమెంట్.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు.
సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్నసొమ్మునంతా తిరిగి రికవరీ చేసి ఇప్పించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని, గంటలోపే అప్రమత్తతే కీలకమని అది “గోల్డెన్ అవర్(Golden Hour)” అని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.