కంపెనీ కాలుష్యంతో ప్రజలకు అవస్థలు..

కంపెనీ కాలుష్యంతో ప్రజలకు అవస్థలు..

  • పలుమార్లు విన్నవించిన పట్టించుకోని యాజమాన్యం
  • కంపెనీ బందుకు పిలుపునివ్వనున్న గ్రామస్తులు

వెల్దండ, ఆంధ్రప్రభ ; వింటేజ్ కాఫీ కంపని నుండి వెలువడే కాలుష్యంతో గ్రామంలోని ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నట్టు తెలిపారు. వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామపంచాయితీలో నెలకొల్పిన వింటేజ్ కాఫి కంపెనీ నుండి వెలువడే కాలుష్యం వలన గ్రామంలోని ప్రజలు,రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నట్టు రైతులు తెలియజేశారు. రైతులు రాత్రి ,పగలు, వ్యవసాయ పొలాలకు వెళ్లే తరుణంలో కంపెనీ నుండి వెలువడే వ్యర్థపు దుమ్ము ధూళితో వాహనదారుల కంటిలో చేరి ఎన్నో సందర్భాలల్లో వాహనదారులు ప్రమాదాలకు గురైనట్టు తెలిపారు.

ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడిన సందర్భాలెన్నో ఉన్నా పలు మార్లు కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తగదని మండిపడ్డారు. వ్యర్థపు నీరును మల్లించడంతో పొలాలాల్లో నీరుచేరుకొని దుర్వాసనతో పాటుగా పంటలు పూర్తిగా రంగు మయంగా మారి భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని రైతులు తెలిపారు. కంపెనీ నుండి వెలువడే దుమ్ముతో వ్యవసాయ పొలంలోని ఆకుకూరలు,కురగాయాలు,పూర్తిగా బూడిదమయంగా మారడంతో కొనడానికి ఎవ్వరు ముందుకు రాక పోవడంవలన రైతులు దిగాలు చెందుతున్నట్టు ఆరోపించారు.

గ్రామంలోని ఆరుబయట ఆరవేశిన దుస్తులు పూర్తిగా నలుపు మయంకావడంతో పాటుగా వసతి గృహాలాన్ని పూర్తిబూడిదగా మారుతున్నాయని గృహిణి దారులు పేర్కొన్నారు. ఎన్నోమార్లు అధికారులకు, ప్రజా ప్రజా ప్రతినిదులకు పిర్యాధులు అందజేశిన పట్టించుకున్న దాకలాలు పోలేదాన్నారు. ఇకనైనా నాయకులు, అధికారులు, స్పందించి కంపిని పై తగుచర్యాల తీసుకోవాలని రైతులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లేనిపక్షంలో త్వరలో గ్రామస్తుల ఆధ్వర్యంలో కంపెనీని బంద్ చేయిస్తామని అన్నారు.

Leave a Reply