GOVT | అర్హులందరికీ పింఛన్లు
ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
GOVT | గన్నవరం, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి తమ ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందని ప్రభుత్వ విప్ (Whip) గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం పాతపాడు గ్రామంలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో యార్లగడ్డ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందచేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం (Gannavaram) నియోజకవర్గ వ్యాప్తంగా డిసెంబర్ నెలకు 40,871 మందికి సామాజిక పింఛన్ల రూపంలో రూ.17.53 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా 50మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెలా ఒకటో తేదీ సాయంత్రానికి దాదాపు లబ్ధిదారులందరికీ పింఛన్లు అందజేస్తున్నట్లు వివరించారు. ఒకటో తేదీ సెలవు వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని విచారణ అనంతరం అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.

అనంతరం నున్న గ్రామంలో
డాక్టర్ పోలారెడ్డి దినేష్ రెడ్డి కొత్తగా ఏర్పాటుచేసిన ఐడల్ హార్ట్ కేర్ సెంటర్‌ను సోమవారం ఉదయం ఎమ్మెల్యే (MLA) యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సొంత గ్రామంలో గుండె వ్యాధుల వైద్యశాల ఏర్పాటు చేసిన దినేష్ రెడ్డిని అభినందించారు. వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ వైద్యశాలలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అధునాతన వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రామవరప్పాడు గ్రామంలో ఆర్కే హోటల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో గన్నవరం వ్యవసాయ మార్కెట్ (Market) యార్డ్ కమిటీ చైర్మన్ గూడవల్లి నర్సింహారావు, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, కొల్లా ఆనందకుమార్, బొప్పన హరికృష్ణ, స్వర్నాల బాలాజీ, టీడీపీ పాతపాడు గ్రామ అధ్యక్షులు కొండేటి వెంకటరత్నం, కలతోటి శ్రీనివాసరెడ్డి, బెజవాడ నాగేశ్వరరావు, కొండేటి శ్రీనివాసరావు, కోనేరు నాగేంద్ర కుమార్, గండికోట సీతయ్య, మేడేపల్లి రమ, నెక్కంటి శ్రీదేవి, గంపా శ్రీనివాస్, పట్టపు చంటి, షేక్ నబి, మాదు శివరాంప్రసాద్, కొరికానీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

