ఎన్టీఆర్ భరోసా.. పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా.. పెన్షన్ల పంపిణీ
రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారుల ముంగిటకే నగదు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, అవనిగడ్డలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. రేపు (ఆదివారం) సెలవు దినం కావడంతో, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు.టీడీపీ నాయకులు స్వయంగా పాల్గొని, వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు పెన్షన్లను అందజేశారు.ఉదయం నుండే పంపిణీ ప్రక్రియ ప్రారంభించి, సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకున్నారు.

పెంచిన పెన్షన్ మొత్తాన్ని నేరుగా ఇంటి వద్దే అందుకోవడం పట్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ పార్టీ నాయకులు దాసినేని శ్రీనివాసరావు,ఘంటసాల రాజమోహనరావు,షేక్ బాబావలి,బట్టు నరసింహారావు,మెగవత్తు గోపి,జట్టావత్తు శ్రీను,కొండవీటి గోవింద్,మైల హరిబాబు,గాలం శ్రీను,కైతేపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు
