కిష్టప్ప పేటలో పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్

కిష్టప్ప పేటలో పింఛన్ పంపిణీ

( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ (Srikakulam MLA Gondu Shankar) అన్నారు. రూరల్ మండలంలోని కిష్టప్ప పేట, గేదెలవానిపేట గ్రామాలలో బుధవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో పింఛను (pension) కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు అనేక ఇబ్బందులు పడేవారని వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chief Minister Chandrababu Naidu) అని పేర్కొన్నారు.

పింఛన్ పెంపుతో వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఆసరా కలిగిందని ఆయన వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు (welfare schemes) అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి నిలుపుతానని ఈ సందర్భంగా శంకర్ హామీని ఇచ్చారు. అనంతరం గేదలవానిపేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని ఆయన సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ కష్టాలు తీర్చి వారి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply