Peddi toxic Dhurandhar 2 | రన్ టైమ్స్ ఫిక్స్..?

Peddi toxic Dhurandhar 2 | రన్ టైమ్స్ ఫిక్స్..?
peddi toxic Dhurandhar 2 | పెద్ది రన్ టైమ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
ధురంధర్ 2 నిడివి నిజంగానే 4 గంటలా?
టాక్సిక్ రన్ టైమ్ పై వైరల్ అవుతున్న లీకులు
మార్చి రిలీజ్‌లపై పెరుగుతున్న అంచనాలు
కంటెంట్ ఉంటే రన్ టైమ్ సమస్యే కాదు
Peddi toxic Dhurandhar 2 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమాల రన్ టైమ్ మారుతుంది. ఒకప్పుడు అయితే.. మూడు గంటలు దాటిన సినిమాలు వచ్చేవి. అయితే.. రాను రాను రన్ టైమ్ (Run Time) మారింది. చాలా వరకు 2 గంటల 30 నిమిషాల నిడివితో ఉన్న సినిమాలనే తీస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ రన్ టైమ్ లెక్కలు మారాయి. ఈ జనరేషన్ లో కూడా 3 గంటలు దాటిన రన్ టైమ్ తో సినిమాలు తీస్తున్నారు కొంత మంది ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు పెద్ది, టాక్సిక్, ధురంధర్ 2 సినిమాల రన్ టైమ్స్ కు సంబంధించి వార్తలు వస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఈ మూడు సినిమాల గురించి ప్రచారంలో ఉన్న వార్తలు ఏంటి..? వీటి రన్ టైమ్ నిజంగానే ఫిక్స్ అయ్యిందా…?
Peddi toxic Dhurandhar 2 | పెద్ది వార్తలను ఖండించిన మేకర్స్..
పెద్ది సినిమా రన్ టైమ్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇది చాలా పెద్ద సినిమా అని.. రన్ టైమ్ చాలా ఎక్కువ అని.. నాలుగు గంటలు ఉంటుందని ఇలా కొన్ని వార్తలు ప్రచారంలోకి రావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తలను మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers) ఖండించింది. ఇక ధురందర్ 2 విషయానికి వస్తే.. 3 గంటల 40 నిమిషాలు అని న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడేమో ఏకంగా 4 గంటల 5 నిమిషాలు అంటున్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు ప్రచారంలోకి వచ్చాయి.

Peddi toxic Dhurandhar 2 | కంటెంట్ లో విషయం ఉంటే..
ఇక టాక్సికి్ విషయానికి వస్తే.. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు అని ఓసారి ప్రచారం జరిగింది. ఆతర్వాత 3 గంటల 20 నిమిషాలు ఉంటుందని మరో వార్త చక్కర్లు కొట్టింది. ఇలా రకరకాల లీకులు వస్తూనే ఉన్నాయి. అయితే.. మేకర్స్ అఫీషియల్ గా చెప్పే వరుకు ఏదీ నమ్మలేం. జనవరి నెలలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. ఆతర్వాత ఫిబ్రవరిలో వచ్చిన ఏ సినిమా (Movie) కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు. దీంతో మార్చిలో వచ్చే సినిమాల కోసం.. ముఖ్యంగా టాక్సిక్, ధురందర్ 2 కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండడంతో దీనికి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా వైరల్ అయిపోతుంది. అయితే.. కంటెంట్ లో విషయం ఉంటే.. రన్ టైమ్ తో సంబంధం లేదు. ఎంత ఎక్కువ రన్ టైమ్ ఉన్నా చూస్తున్నారు. సో.. ఈ మూడు సినిమాల రన్ టైమ్ ఎలా ఉన్నా.. కంటెంట్ బాగున్నదానికే జనాల ఆదరణ లభిస్తుంది.

