Peddi | స్పెషల్ సాంగ్ ఎవరితో..?

Peddi | స్పెషల్ సాంగ్ ఎవరితో..?
Peddi | పెద్ది స్పెషల్ సాంగ్‌పై సస్పెన్స్
మృణాల్ ఠాగూర్ vs మానస వారణాసి
యూత్‌లో క్రేజ్ పెంచుతున్న ఎంపిక
పెద్ది రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఎప్పుడు?
Peddi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గానే ఉంది. ఇప్పుడు ఈ మూవీ స్పెషల్ సాంగ్ ఎవరితో అనేది కూడా సస్పెన్స్ గా మారడం విశేషం. పెద్ది స్పెషల్ సాంగ్ బ్యూటీ అంటూ కొంత మంది తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ ఖరారు చేసారని టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ ప్లేస్ లో మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది. ఇంతకీ.. మృణాల్ ప్లేస్ లో మరో తార అంటూ వినిపిస్తున్న హీరోయిన్ ఎవరు..? పెద్ది వచ్చేది ఎప్పుడు..?
Peddi | మృణాల్ ప్లేస్ లో మానస వారణాసి..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి హైప్ ఉన్న నేపథ్యంలో, తాజాగా స్పెషల్ సాంగ్‌లో ఎవరు కనిపించబోతున్నారు? అనే విషయం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ పేరు వినిపించగా, ఇప్పుడు కొత్తగా మానస వారణాసి పేరు తెరపైకి రావడంతో సస్పెన్స్ మరింత పెరిగింది. సినిమాలో ఉండే స్పెషల్ సాంగ్‌కు మేకర్స్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, థియేటర్లలో హైలైట్ అయ్యేలా ఈ పాటను ప్లాన్ చేస్తున్నారట.
Peddi | యూత్ లో క్రేజ్..

అందుకే ఈ సాంగ్‌లో కనిపించే హీరోయిన్ ఎంపిక విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మృణాల్ ఠాగూర్ పేరు వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు మానస వారణాసి పేరు రావడంతో అసలు ఎవరు ఫైనల్ అవుతారు అనే ఆసక్తిగా మారింది. మృణాల్ ఠాగూర్ ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఒక స్పెషల్ సాంగ్ చేస్తే సినిమాకు భారీ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరో వైపు, మానస వారణాసి.. కపుల్ ఫ్రెండ్లీ మూవీతో సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Peddi | పెద్ది వచ్చేది ఎప్పుడు..?

మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న మానస, గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాటకు కొత్త ఆకర్షణ తీసుకురావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ఎవరి పేరును ప్రకటించకపోవడంతో, ఈ స్పెషల్ సాంగ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరో వైపు పెద్ది సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. మార్చి 27న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. కానీ తర్వాత ఆ డేట్ పై క్లారిటీ లేకపోవడంతో, రిలీజ్ వాయిదా పడే అవకాశముందని టాక్ మొదలైంది. ప్రస్తుతం మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌పై ఆలోచిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి.. త్వరలోనే పెద్ది మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
