Peddapally | ప్రశాంతంగా ముగిసిన పల్లెపోరు

Peddapally | ప్రశాంతంగా ముగిసిన పల్లెపోరు

  • మూడవ విడత పోలింగ్ 85.66 శాతం నమోదు
  • పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
  • పటిష్టమైన పోలీస్ బంధువస్తూ

Peddapally | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపెల్లి జిల్లాలో పల్లె పోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో బుధవారం నిర్వహించిన మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా, ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడతలో 85.66శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మూడవ విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓదెల మండలం కొలనూరు జెడ్పీహెచ్ఎస్, పెద్దపల్లి మండలం పెద్ద కల్వల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.

Peddapally

మూడవ విడత 85 గ్రామ పంచాయతీలకు, 636 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 85.66 % మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మూడవ విడత పోలింగ్ నిర్వహించిన పెద్దపల్లి మండలంలో 86.39%, సుల్తానాబాద్ మండలంలో 86.51శాతం, ఎలిగేడు మండలంలో 83.73%, ఓదెల మండలంలో 84.70% పోలింగ్ నమోదైందని, మొత్తం లక్షా 42 వేల 548 మంది ఓటర్లకు గాను లక్షా 22 వేల 111 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీ కృష్ణల ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply