పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి

పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి
27 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పెద్దపల్లి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 27చోట్ల ఘనవిజయం సాధించారు. ఇవాళ మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కౌంటింగ్ లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించడంతో పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలను తీసుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు 27మంది ఘన విజయం సాధించారు. ఐదు వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించగా, ఇద్దరు ఇండిపెండెంట్ లు, బిజెపి ఒక స్థానంలో, బిఆర్ఎస్ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించారు. నియోజకవర్గంలోని సుల్తానాబాద్ లో సైతం కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
