Peddakorukondi | గెలుపు మాదే : మాదిరాజు..

Peddakorukondi | గెలుపు మాదే : మాదిరాజు..

Peddakorukondi, కల్లూరు, ఆంధ్రప్రభ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద కోరుకొండి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి మాదిరాజు శైలజ ప్రజాక్షేత్రంలో గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రభ విలేకరులతో వారు మాట్లాడారు. సుమారుగా నాలుగు దశాబ్దాలు గ్రామపంచాయతీ ప్రజలతో మమేకమై జీవిస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మమల్ని ప్రజలను నూటికి నూరు శాతం ఆదరిస్తారని, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రెవెన్యూ మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నామని చెప్పారు.

ఈ గ్రామాన్ని ఉమ్మడిపంచాయతీగా ఉన్న దగ్గర నుంచి నేటి వరకు సుమారు 65 సంవత్సరాలుగా మా కుటుంబీకులు, మా అనునయుల ద్వారానే గ్రామ సర్పంచులుగా పరిపాలన సాగించి గ్రామాన్ని అన్ని రంగాలలో అంచలంచలుగా అభివృద్ధి చేశామని వారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న మా కుటుంబాన్ని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో క్రికెట్ బ్యాట్ గుర్తు పై గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.

Leave a Reply