peanut crop | శనగ పంటతో అధిక లాభాలు

peanut crop | శనగ పంటతో అధిక లాభాలు

  • శనగ నంద్యాల గ్రామ్ 1267 రకం అధిక దిగుబడి
  • ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్

peanut crop | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : అఖిల భారత శనగ సమన్వయ పథకంలో భాగంగా శనగ పంటలో నంద్యాల గ్రామ్ 1267 రకం అధిక దిగుబడి నిస్తుందని, అపరాల సాగు అఖిల భారత సమన్వయ పథకం ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ శైలేష్ త్రిపాఠి, మంకీ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఎం.జాన్సన్ పేర్కొన్నారు. గురువారం ప్రాంతీయ పరిశోధన స్థానంలోని శనగ పంటను పరిశీలించారు. శనగ పంటపై వివిధ విభాగాలలో చేపట్టిన పరిశోధన అంశాలను క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నదనేది పరిశోధనలో వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు శ‌నగ పంట అనువైనదై అధిక దిగుబడి నిస్తుందని తెలిపారు.

జిల్లాలోని హుసేనాపురం ఓర్వకల్లు మండలాలలో అధిక దిగుబడి నిచ్చే నంద్యాల గ్రామ్ 1267 వేసిన పంటను సందర్శించారు. దిగుబడి ఆశాజనకంగా ఉందని తెలిపారు. శనగ పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. శనగలు మరో రకమైన నంద్యాల గ్రామ్ 776 రకం దిగుబడిని కూడా పరిశీలించారు. శనగ పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సైంటిస్టు నీలిమ తోపాటు పలువురు పాల్గొన్నారు.

peanut crop

Leave a Reply