PBKS vs CSK | శ‌త‌క్కొట్టిన ప్రియాంష్ ఆర్య !!

పంజాబ్ వేదిక‌గా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య సంచలనం సృష్టించాడు. టాపర్ కుప్పకూలినప్పటికీ ఆర్య మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ధ‌నాధ‌న్ బౌండ‌రీల‌తో ఆకాశ‌మే హ‌ద్దురా అన్నట్టు చెల‌రేగిన ఆర్య‌.. స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. దీంతో (40 బంతుల్లో 7ఫోర్లు, 9 సిక్సుల‌తో 102) తుఫాన్ వేగంతో సెంచరీ సాధించాడు. శ‌శాంక్ సింగ్ (23) తో క‌లిసి 6వ వికెట్ కు 71 ప‌రుగులు జోడించాడు ఆర్య.

దీంతో 13.0 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు సాధించింది పంజాబ్ కింగ్స్.

Leave a Reply