Pawan | మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం..

Pawan | మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం..
ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం
తీర ప్రాంత మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు
త్వరలో పిఠాపురం వేదికగా ప్రకటన
Pawan |ఆంధ్ర ప్రభ, వెబ్ డెస్క్ః ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల అభివృద్ధి మా లక్ష్యమని డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వారి అభివృద్ది కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలకు రూపొందించామన్నారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీ కాకినాడ కలెక్టరేట్ లో మత్స్యకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించామన్నారు.
తీర కాలుష్య నివారణ, కోత నివారణ, మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతులలో వేట, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, ఇలా మత్స్యకారులు జీవితాలకు భద్రత, భరోసా కల్పించేందుకు అవసరం అయిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రణాళికలో పొందుపర్చామని వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడంతోపాటు వ్యవసాయ అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. నిర్దుష్ట లక్ష్యంతో రూపొందించిన ప్రణాళిక – ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
