NZB | అందరి కృషితోనే జిల్లా సహకార అభివృద్ధికి బాటలు…

డీసీసీబీ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి, సీఈఓ వందే నాగభూషణం


నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్1 (ఆంధ్రప్రభ) : బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది అందరి కృషితోనే జిల్లా సహకార అభివృద్ధి బాటలు వేసి లాభాల బాటలు తీసుకువచ్చారని డీసీసీబీ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి, సీఈఓ వందే నాగభూషణం అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకును లాభాల బాటలో తీసుకువచ్చి అభివృద్ధికి కృషిచేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల జిల్లా సహకార బ్యాంకు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీబీ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి, సీఈఓ వందే నాగ భూషణం, మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యాపార కార్యకలాపాల్లో రికార్డు స్థాయిలో ఎన్పీఏ సుమారు రూ.63 కోట్లు రికవరీ చేస్తూ రూ.27 కోట్లు లాభాలు తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 14శాతంగా ఉన్న ఎన్పీఏ 7.82 శాతంనకు తగ్గించారు. ఇంత గొప్ప విజయం సాధించిన శుభపరిణామాన్ని పురస్కరించుకొని బ్యాంకు ఉద్యోగులు, సిబ్బందితో కలిసి అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం చేరుకున్నందుకు ప్రతీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీబీ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ… బ్యాంకు బాగుంటే మనం బాగుంటామని, భవిష్యత్ బాగుంటుందని పునరుద్ఘాటించారు. ఈ విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షులు నల్ల చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ లింగన్న, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *