Pathal Ganga | ఇంట్లోకి వచ్చిన ఓ చిరుత…

Pathal Ganga | ఇంట్లోకి వచ్చిన ఓ చిరుత…
- సీసీ కెమెరాలలో కనిపించిన చిరుత…
- ప్రజలు ఆందోళన..
- భక్తులు అప్రమత్తంగా ఉండాలి..
- అటవీశాఖ అధికారులు హెచ్చరిక లు..
Pathal Ganga | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు, చిరుతలు, పులులు జనారణ్యంలోకి రావటం మొదలుపెట్టాయి. చిరుతలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్న సంఘటన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగ సమీపంలో చోటుచేసుకుంది. ఇవాళ ఇంట్లోకి చిరుత ప్రవేశించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

పాతాళగంగ సమీపంలో పూజారి ఇంటిలో అర్ధరాత్రి ప్రవేశించడం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ ఇంటి వారు భయాందోళన చెందారు. గత వారం రోజుల క్రితం కూడా ఓ పెద్దపులి పాతాళగంగలోని నదిని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరిన సంఘటన పాఠకులకు తెలిసిందే. ఇవాళ కూడా పాతాళగంగ సమీపంలోని ఇండ్లలో ఓ చిరుత కనిపించటం అక్కడ ఉన్నటువంటి గృహాల వారు భయాందోళన చెందుతున్నారు. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. దీంతో ఆలయ అధికారులు ఫారెస్టులో భక్తులను అప్రమత్తం చేశారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు వెళుతూ ఉంటారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. అడవిలో ఉన్నటువంటి ఈ జంతువులు జనారణ్యంలోకి రావడం అక్కడ ఆహార కొరతనే కారణమని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఫారెస్ట్ కన్జర్వేటివ్ విజయ్ కుమార్ తెలిపారు.
