నవీన్ యాదవ్ కు పాస్టర్లు మద్దతు…

జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పాస్టర్ల సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అలాగే ఏఐసీసీ సెక్రటరీలు విశ్వనాథ్, సంపత్ కుమార్, దీపక్ జాన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న పాస్టర్లు రానున్న నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఘన విజయంతో గెలిపించేందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
