రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

సరుబుజ్జిలి(ఆమదాలవలస), ఆంధ్రప్రభభ): రైతన్నల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆమదాలవలస ఎమ్మెల్యే,, రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సరుబుజ్జిలి మండలం విజయరాంపురం గ్రామంలో మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన తప్పులను సరిదిద్ది, పారదర్శకత కోసం రాజముద్రతో కూడిన పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులే నేరుగా రైతుల ఇళ్ల వద్దకు వచ్చి వీటిని పంపిణీ చేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు శివాల సూర్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు అంబల్ల రాంబాబు, నందివాడ గోవిందరావు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply