ప|| పార్వతీ జగన్మాత శివదూతీ
తపస్వినీ, లోకజననికీ పరమ శివునకు
పార్వతికీ నీరాజనం
అను|| మాహారౌద్రీ వామదేవి
వాగ్భవికీ వర్ధనికీ
పరమేశ్వరు రాణికీ నీరాజనం
చ|| ధరాధర భవానీకీ నిఖిల మో#హని
ఈశ్వరికీ ప్రణవాత్మికకూ
సదాపుర స్థాయికీ వీరపత్నికీ
భవభయ నాశనికీ పురుషార్ధ ప్రదాయినీకీ పరమశివునకూ
పార్వతికీ జగజ్జననికి నీరాజనం