Part-time | అతనితో పాటు.. ఆ యువతి కూడా…

Part-time | అతనితో పాటు.. ఆ యువతి కూడా…
Part-time | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బైక్‌ను వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో జరిగింది. మృతులను హోంగార్డు సయ్యద్ హుస్సేన్, యువతి అక్షితగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా…. హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న సయ్యద్ హుస్సేన్ సంతోష్‌నగర్ ట్రాఫిక్ పీఎస్‌లో విధులు ముగించుకున్న తర్వాత పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో బైక్ డ్రైవర్‌గానూ పనిచేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం అక్షిత అనే యువతి ర్యాపిడో ద్వారా రైడ్ బుక్ చేసుకుని సయ్యద్ హుస్సేన్ బైక్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్షితను విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

