TG | తప్పుడు లెక్కలతో పార్లమెంటును తప్పుదోవ పట్టించారు..

  • రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సమగ్ర సర్వేపై పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా..? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

లక్షలాది మంది వివరాలను సేకరించకుండానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణాల సర్వే పూర్తి చేసిందంటూ.. లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటన పార్లమెంటును తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు. తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తప్పుడు లెక్కలతో సర్వే పూర్తి చేయడం ముమ్మాటికీ మోసమేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

బీసీల జనాభాను తగ్గించి వెనుకబడిన వర్గాలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని అసెంబ్లీ సాక్షిగా స్పష్టమవుతోందన్నారు.

పదేళ్ల క్రితం అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1కోటి 85 లక్షలుగా తేలింద‌ని… రాష్ట్ర జనాభాలో 51శాతం అని గుర్తుచేశారు. మైనార్టీల్లోని బీసీలను కూడా కలుపుకుంటే బీసీల సంఖ్య 61 శాతానికి చేరిందని స్పష్టం చేశారు.

పదేళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులగ‌ణ‌న సర్వేలో బీసీల జనాభా 1 కోటి 64 లక్షలకు తగ్గి.. 46 శాతానికి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *