త‌ల్లిదండ్రుల క‌ల‌లు నెర‌వేరుస్తూ..

త‌ల్లిదండ్రుల క‌ల‌లు నెర‌వేరుస్తూ..

కరీంనగర్, ఆంధ్ర‌ప్ర‌భ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రామడుగు పోలీస్ స్టేషన్‌(Police station)లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ రోజు నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రామడుగు ASI మనోజ్ కుమార్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులు అని, ప్రతి విద్యార్థి మంచి నడవడికతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో ముందుకు సాగుతూ అత్యున్నత స్థాయికి ఎదగాల‌ని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల(Parents) కలలు నెరవేరుస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

అదే విధంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్(Functioning), డయల్ 100, షీ టీమ్స్, భరోసా, సైబర్ అవేర్నెస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్, వంటి వివిధ నేర సంబంధిత అంశాలపై వివరించి పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మనోజ్ కుమార్, మధుసూదన్(Madhusudan), రామడుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది, అక్షర హై స్కూల్ విద్యార్ధినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply