Parakala | మున్సిపల్ ఉద్యోగి అకాల మరణం
మృతునికి మడికొండ బ్రదర్స్ నివాళులు
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో ఆకాల మరణం చెందిన మున్సిపల్ ఉద్యోగి ఒంటేరు సాంబయ్య (Onteru Sambaiah) పార్థివ దేహాన్ని మడికొండ బ్రదర్స్ సందర్శించి నివాళులర్పించారు. పరకాల మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో ఒంటేరు సాంబయ్య ఇవాళ అకాల మరణంచెందగా, ఒంటేరు సాంబయ్య పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరకాల పురపాలక సంఘం ఒకటో వార్డు తాజా మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, టిపిసిసి ఎస్సీ సేల్ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడికొండ బ్రదర్స్ తో పాటు కాంగ్రెస్ నాయకులు బొచ్చు భాస్కర్, బొచ్చు జితేందర్, బొచ్చు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

