Parakala | బి ఫామ్‌లు అందజేసిన నాయకులు…

Parakala | బి ఫామ్‌లు అందజేసిన నాయకులు…
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల బి ఫామ్‌లను బీజేపీ నాయకులు ఎన్నికల అధికారులకు అందజేశారు. పరకాల మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు పరకాల మున్సిపల్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థుల బి ఫామ్‌లు రిటర్నింగ్ ఆఫీసర్లకు మునిసిపల్ ఎన్నికల ఇన్చార్జి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరింగి సంతోష్ కుమార్ అందజేశారు.
