Parakala | “మా నానమ్మను గెలిపించండి”

Parakala | “మా నానమ్మను గెలిపించండి”
చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. 12 వ వార్డులో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి గంట కళావతి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె వెంట ఉన్న తన మనవరాలు “మా నానమ్మకు ఓటు వేసి గెలిపించండి” అంటూ ఓటర్లను మనస్ఫూర్తిగా కోరింది. చిన్నారి అమాయకమైన అభ్యర్థనకు ఓటర్ల హృదయాలు కరిగిపోయాయి. ఆమెను ఆప్యాయంగా ఒడిలో కూర్చోబెట్టుకున్న ఓటర్లు, “మా ఓటు మీ నానమ్మకే, ఆమెనే కౌన్సిలర్‌గా గెలిపిస్తాం” అంటూ హామీ ఇచ్చారు. దీనితో ఆనందం వ్యక్తం చేసిన చిన్నారి ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపగా, ఆ దృశ్యం అక్కడున్న వారందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సంఘటన ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
