ఒంగోలు జిల్లాలో కలవరం…

ఆంధ్రప్రభ , ఒంగోలు రూరల్ : ఒంగోలు సమీపంలో తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు పీతూరు వాగు పొంగి ప్రయోగించడంతో కారు కొట్టకపోయిన ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోనే 18వ డివిజన్ లో భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీ సమీపంలో భారీ వర్షాలకు పితూర్ వాగు ఉద్బతంగా ప్రవహిస్తుంది. అనుకోకుండా వరద గ్రహించకుండా ఒక వ్యక్తి కారులో రావటంతో వరద ప్రవాహం కు కారు కొట్టక పోయింది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈత రావటంతో సేఫ్ గా ప్రాణాల దక్కించుకున్నారు. పక్కనే ఉన్న కొందరు తాడు సహాయంతో కార్ లోని వ్యక్తిని కాపాడటం జరిగింది. భగీరథ కెమికల్స్ డైరెక్టర్ వెంకట్రామయ్య భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎవరు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు.

Leave a Reply