Pamarru | ప్రజా సహకారం తప్పనిసరి

Pamarru | ప్రజా సహకారం తప్పనిసరి

  • డిపిఓ డాక్టర్ జె. అరుణ

Pamarru | పామర్రు – ఆంధ్రప్రభ : స్వచ్ఛ కృష్ణ – స్వచ్ఛ మన గ్రామం కార్యక్రమాల నిర్వహణలో ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమ‌ని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణ అన్నారు. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించి స్వచ్ఛతలో- మేము సైతం అనే కార్యక్రమాన్ని తొలి సంతకం చేసి ఆమె ప్రారంభించారు.

Pamarru

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ప్రతి పౌరుడు పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతగా మెలుగుతూ పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన ఆవశ్యకతను అని వివరించారు. ప్రతి ఒక్కరూ డీపీఓతో కలిసి స్వచ్ఛతలో మేము సైతం అంటూ గోడపై సంతకాలు చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ డెవలప్ మెంట్ అధికారి పి.రాజేష్, ఎంపీడీవో బండి ప్రవీణ, గ్రామపంచాయతీ సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply