హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి…

హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి…
ఐదు సంవత్సరాలు సేవ చేస్తా…
పాల్వంచ 9 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి డివిజన్లో ఐదు సంవత్సరాల సేవలందిస్తా అని 47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసు మల్ల సుందర రావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ మునిసిపాలిటీ పరిధిలో 47వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యసిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని పథకాలే తమకు శ్రీరామరక్షాన్ని అన్నారు. డివిజన్లో ఉన్నటువంటి పలు సమస్యలపై గెలిచిన వెంటనే పరిష్కార మార్గం చూపుతానని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే అభివృద్ధిని పరుగులు పెట్టించొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
