అందరివాడిని ఆదరించి గెలిపించండి…

అందరివాడిని ఆదరించి గెలిపించండి…
అభివృద్ధి చేసుకుందాం..
పాల్వంచ 8 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): అందరివాడిని ఆదరించి గెలిపించండి డివిజన్ ను అభివృద్ధిని చేసుకుందాం అని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసుమల్ల సుందర్రావు అన్నారు. ఆదివారం ఇంటింటికి తిరుగుతూ ప్రసారాన్ని ముమ్మరం చేశారు.డివిజన్లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తమ గెలుపుకు శ్రీరామరక్ష అన్నారు. డివిజన్లోని అన్ని సమస్యలు తనకు తెలుసని ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ శాతం మంజూరు చేయించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. డివిజన్ లో మౌలిక వసతులు కల్పించడానికి అందుకు సంబంధించిన అన్ని నిధులను తెప్పించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఓటు మీ బాధ్యత అభివృద్ధి నా బాధ్యత అంటూ ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ తెలపడంతో విశేష స్పందన లభిస్తుంది. భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
