pakistan| ఛీ.. మీరు మారర్రా..?

pakistan| ఛీ.. మీరు మారర్రా..?
కాంట్రవర్సీలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు
హోటల్ మహిళా సిబ్బందితో పాకిస్థాన్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన
సారీ చెప్పిన ఆ జట్టు మేనేజర్!
ఇవేం పనులంటూ నెటిజన్లు ఫైర్!
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పాకిస్థాన్ క్రికెటర్లు ఎక్కడ ఉన్నా వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకుంటాయి. మైదానంలోనే కాదు బయట కూడా వీరి ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. తాజాగా ఓ సంఘటన చాలామందికి అసహ్యం కలిగిస్తోంది. ఏమైందంటే..
టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంకలో జరుగుతున్న ఈ టోర్నీ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ క్రికెటర్ హోటల్ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు రావడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనం రేపుతోంది.

ఫిబ్రవరి 28న సూపర్- 8 దశలో పాకిస్థాన్ తమ ఆఖరి మ్యాచ్‌ను పల్లెకెలె స్టేడియం వేదికగా శ్రీలంకతో ఆడింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ జట్టు కాండీలోని గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో బస చేసింది. ఈ క్రమంలో హౌస్‌కీపింగ్ పనిచేస్తున్న మహిళా సిబ్బందితో పాక్ ఆటగాడు అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. వెంటనే సదరు మహిళ గట్టిగా అరవడంతో హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను కాపాడారని సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ హోటల్ యాజమాన్యం, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు ఫిర్యాదు చేసింది. హోటల్ మేనేజ్మెంట్ ఆ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా.. నవైద్ చీమా పాక్ జట్టు తరపున క్షమాపణలు చెప్పారు. అనంతరం సదరు క్రికెటర్‌కు భారీ జరిమానా విధించి విషయాన్ని సద్దుమణిగేలా చేశారు.

సదరు ఆటగాడి పేరును మేనేజ్మెంట్ ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ.. అతను త్వరలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరుకావాల్సి ఉంటుందని సమాచారం. బోర్డు అతనిపై మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సూపర్-8లో శ్రీలంకపై పాక్ విజయం సాధించినప్పటికీ, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో సెమీస్ చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది.

