pakistan | అమెరికా రాయబారి కార్యాలయంపై దాడులు

pakistan | అమెరికా రాయబారి కార్యాలయంపై దాడులు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మృతితో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. తాజాగా పాకిస్థాన్‌లోని కరాచీలో అమెరికా రాయబారి కార్యాలయంపై దాడులు చేశారు. తమతో తెచ్చుకున్న వాటితో ఎంబసీ ఆఫీసును ధ్వంసం చేశారు ఆందోళనకారులు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. నిరసనల కారణంగా పలు రహదారులు మూసివేశారు
