బలూచీస్తాన్ – జైళ్లలో ఉన్న తమ వారిని జైళ్ల నుంచి పాక్ ప్రభుత్వం విడిచిపెట్టకపోవడంతో బలూచీస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు.. ట్రైన్ హైజాక్ తర్వాత పాక్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించామని, ఆలోగా పాక్ జైళ్లలోని తమ వారిని విడుదల చేయకపోతే బందీలను చంపేస్తామని హెచ్చరించామని గుర్తుచేసింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో డెడ్ లైన్ ముగియగానే తమ బందీలుగా ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు..
కాగా, పాకిస్థాన్ జైళ్లలోని తమ నాయకులను విడిపించుకోవడానికి బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ హైజాక్ తో పాకిస్థాన్ ఆర్మీ స్పందించి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మిలిటెంట్ల చెరలో ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు బలగాలను రంగంలోకి దింపింది. దాదాపు రెండు రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, 33 మంది మిలిటెంట్లను మట్టుబెట్టామని ప్రకటించింది. రైలులోని 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సైనికులు చనిపోయారని పేర్కొంది. మిగతా ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రకటనను బీఎల్ఏ ఖండించింది. ఈ నేపథ్యంలోనే తమ వద్ద బందీగా ఉన్న పాక్ సైనికులందర్ని కాల్చివేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది.