పాకల  బీచ్  అభివృద్ధికి కృషి

పాకల  బీచ్  అభివృద్ధికి కృషి

పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు

 – రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

( గిద్దలూరు, ఆంధ్రప్రభ)

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్ లో బీచ్ ఫెస్టివల్  నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం గిద్దలూరు సమీపంలోని రాయల్ రిసార్ట్స్ లో పాకల బీచ్ ఫెస్టివల్ కుసంబంధిం చిన వాల్ పోస్టర్లను, ఏ.వి ఆడియోను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. రాజబాబు లు ఆవిష్క రించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని పాకల బీచ్ లో ఈనెల 14, 15వ తేదీల్లో రెండు రోజులు పాటు బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పాకల  బీచ్ లో నిర్వహించే ఫెస్టివల్ కు ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా పాకల బీచ్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే  ఆప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆయన చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరూ బీచ్ ఫెస్టివల్స్ కు వచ్చి మంచి అను భూతులు పొందాలని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ ఈనెల 14,15 తేదీలలో పాకల బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించ డానికి చర్యలు తీసుకున్నామని, రెండు రోజులపాటు పాకల బీచ్ లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్స్ కు ప్రజలందరూ హాజరుకావాలని ఆయన చెప్పారు. బీచ్  ఫెస్టివల్ కు ప్రజలందరూ వచ్చి ఆస్వాదించాలని ఆయన కోరారు. పాకల బీచ్ ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, తహసిల్దార్ ఎం. ఆంజనేయ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply