పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధం

పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధం
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భగ్గుమన్న సరిహద్దు వివాదం
55 మంది పాక్ సైనికుల మృతి చెందినట్టు ప్రకటించిన ఆప్ఘన్
ఆపరేషన్ గజాబ్-లిల్-హక్.. ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు
ఇరు దేశాలు శాంతించాలని విజ్ఞప్తి చేసిన ఐక్యరాజ్యసమితి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా ఉన్న పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చిచింది. దీంతో దాయదుల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. తాలిబన్లు జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ‘ఆపరేషన్ గజాబ్-లిల్-హక్’ను ప్రారంభించింది. పాక్ యుద్ధ విమానాలు కాబూల్, కాందహార్, పక్తియా నగరాల్లోని తాలిబన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారీగా ఆయుధ సంపత్తి ధ్వంసమైందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా వెల్లడించింది.
మరోవైపు తమ ఎదురుదాడిలో 55 మంది పాకిస్థాన్ సైనికులను హతమయ్యారని, సరిహద్దులోని 19 పాక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సంచలన ప్రకటన చేశారు. కొంతమంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీంతో మా సహనం నశించింది, ఇక యుద్ధమే అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చెసుకొని ఇరు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ యుద్దం వల్ల సరిహద్దు గ్రామాల్లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రస్తుతం సరిహద్దులోని టోర్ఖమ్ గేట్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
