మొక్కులు చెల్లించుకున్నారు..

మొక్కులు చెల్లించుకున్నారు..

దండేపల్లి, ఆంధ్రప్రభ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలం సత్యనారాయణస్వామి(Satyanarayana Swamy) దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

ఉదయం నుంచి వందలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య‌ స్నానాలు ఆచరించి, గంగమ్మ తల్లి(Gangamma’s mother) ఒడిలో కార్తీక దీపాలు వదిలారు. దగ్గర లో ఉన్న సాయిబాబా, అయ్యప్ప స్వామి ఆయాల్లో ప్రత్యేక పూజలు చేసుకొని ఆలయానికి చేరుకొని సత్యదేవున్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా స్వామి వారి వ్రతాల(Vratala)ను చేసుకున్నారు.

Leave a Reply