TG | కాంగ్రెస్ నిర్లక్ష్య తీరుకు ఇంకెందరు బ‌లి కావాలి : హరీష్ రావు

  • గురుకులల్లో వ‌రుస‌ ఫుడ్ పాయిజన్ ఘ‌ట‌న‌లు..
  • రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే..
  • పాయిజన్ల‌ను అరికట్టాలని డిమాండ్

రాష్ట‌ర గురుకులల్లో వ‌రుస‌ ఫుడ్ పాయిజన్ ఘ‌ట‌న‌ల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పంధించారు. గురుకులల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నిత్యకృత్యమవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటు అని మండిప‌డ్డారు.

నిన్న కందుకూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 84 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరినగర్ సమీపంలోని ఎస్టీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 12 మంది విద్యార్ధులకు ఆసుపత్రి పాలయ్యారు. మాటలే తప్ప చేత‌లు లేని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కార‌ణంగా ఇంకా ఎంత మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవ్వాలి, ఇంకెంద‌రు ప్రాణాలు కోల్పోవాల్సి? అంటూ తన బాధను వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఫుడ్‌ పాయిజన్ల‌ను అరికట్టాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *