కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని శివనగర్ శ్రీశివ విఘ్నేశ్వర దత్త సాయి దేవాలయం ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో… మా ఆలయం క్యాసెట్ కట్ట మల్లన్న దేవస్థానం వేదికగా పోలా ఉమామహేశ్వర్ గురుస్వామి చేతుల మీదుగా ఆడియో క్యాసెట్ అంగరంగ వైభవంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంలో ఆలయం కార్యదర్శి చింతం యాదగిరి మాట్లాడుతూ, గాయకుడు పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్ తన స్వంత రచనతో వ్రాసి, మధురమైన గానంతో శ్రీ విఘ్నేశ్వర ఆలయం కోసం గానం చేసిన గీతం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కవి గాయకులు శ్రీనివాస్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పలు ఆలయ ట్రస్ట్ సభ్యులు కూడా ఆయనను అభినందించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆడెపు శ్యామ్, రాంపల్లి ఉపేందర్, కొయ్యాడ శ్రీధర్, మారేడు పాక సతీష్, శీలం అశోక్ రెడ్డి, తోట శ్రీనివాస్, ఆలయ పూజారి విశ్వేశ్వర శర్మ, కట్ట మల్లన్న అయ్యప్ప కూటీరం స్వాములు, పాలకుర్తి రామ్మోహన్, చక్రపాణి, జీవన్, కిషోర్, విక్రమ్, శ్రీకాంత్, రాహుల్, పెద్దలు కళ్లెపు కిరణ్ కుమార్, కక్కెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

